రేవంత్ రెడ్డి మందు తాగుతాడా.. తాగడా?

by  |
RevanthReddy1
X

దిశ, వెబ్ డెస్క్: రేవంత్ రెడ్డి.. ఈ పేరుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈయన ఏది చేసినా.. ఏం మాట్లాడినా హైలెట్ గా నిలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ధీటుగా ఢీకొంటున్న వ్యక్తుల్లో ఈయనొకరు. కార్యకర్త నుంచి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ చార్జ్ స్థాయి వరకు ఎదిగిన రేవంత్ రెడ్డికి తెలంగాణ రాజకీయాలలో మంచి పేరుంది. ఇతర రాజకీయ నాయకులతో రేవంత్ రెడ్డిని పోలీస్తే తన రూటే వేరు అన్న మాదిరిగా ఉంటారు. ఇతరుల కన్నా భిన్నంగా రేవంత్ రెడ్డి ఆలోచనలు ఉంటాయి. అందుకే రేవంత్ రెడ్డి రాజకీయాలలో ఇంతలా దూసుకుపోతున్నారు అని ప్రజలు, సీనియర్ రాజకీయ నేతలు చెబుతుంటారు. అదేవిధంగా.. రేవంత్ రెడ్డి అలవాట్లకు సంబంధించి కూడా చర్చించుకుంటున్నారు. అదేమిటంటే.. రేవంత్ రెడ్డి మద్యం సేవిస్తాడా లేదా అనేది. అయితే… ఆయన ఇటీవల ఓ మీడియా చానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు మద్యం సేవించే అలవాటు చిన్నప్పట్నుంచి లేదని చెప్పుకొచ్చారు. తన చిన్నతనంలో ఊరిలో ఉన్న పరిస్థితులను చూసి తాను ఎప్పటికీ తాగొద్దని నిర్ణయించుకున్నానని, అందుకే తాను మద్యం సేవించనని చెప్పుకొచ్చారు.

Next Story

Most Viewed