వ్యవసాయశాఖలో 61ఏళ్లకు పదవీ విరమణ

187
Department of Agriculture

దిశ, తెలంగాణ బ్యూరో: వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ లోని ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయసును 61ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం జీఓను విడుదల చేసింది. ఈ ఏడాది మార్చి 31 నుంచి ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జనార్దన్ రెడ్డి ప్రకటించారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ పరిధిలోని గ్రాంట్-ఇన్-ఎయిడ్ సంస్థలు, సంఘాలు, విశ్వవిద్యాలయాలు, కార్పొరేషన్లు, ఇతర సంస్థల్లో విధులు నిర్వహించే ఉద్యోగులందరికి ఈ జీఓ వర్తిస్తుందని తెలిపారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసును 61ఏళ్లకు పెంచారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..