వచ్చే ఏడాది వరకు రిటైల్ ఎన్‌పీఏలు అధికం!

by  |
వచ్చే ఏడాది వరకు రిటైల్ ఎన్‌పీఏలు అధికం!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ నిరర్ధక ఆస్తులు(ఎన్‌పీఏ) అత్యధికంగా నమోదవ్వొచ్చని ప్రైవేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ అభిప్రాయపడింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో తిరిగి కరోనా ముందునాటి స్థాయికి చేరుకోవచ్చని తెలిపింది. కొవిడ్-19 కారణంగా ఆర్థికవ్యవస్థ దారుణంగా ప్రభావితమైందని, అనేక సంస్థలు ఉద్యోగులను తొలగించడం, జీతాలను తగ్గించడంతో రిటైల్ రుణాల చెల్లింపుల సామర్థ్యం క్షీణించినట్టు యాక్సిస్ బ్యాంక్ రిటైల్ లోన్ హెడ్ సుమిత్ వివరించారు.

‘సెప్టెంబర్ నెల వరకు మారటోరియం అవకాశం ఉండటంతో ఎక్కువమంది ఆ వెసులుబాటును వినియోగించుకున్నారు.అక్టోబర్ నుంచి రుణాలను చెల్లించారు. కానీ, ఎక్కువమంది లోన్ రీస్ట్రక్చరింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ అవకాశం ఈ నెలాఖరుకు ముగియనుంది. ఆ తర్వాతే సంపూర్ణ వివరాలు స్పష్టమవుతాయని ఆయన పేర్కోన్నారు. ‘నెలవారీగా రుణాల చెల్లింపులు మెరుగ్గా ఉన్నాయి. అయితే, డిసెంబర్‌తో పాటు మార్చి త్రైమాసికాల్లో ఎన్‌పీఏలు అధికంగా నమోదయ్యే అవకాశాలున్నాయని, 2021 ఏప్రిల్ నెల తర్వాత సాధారణ స్థాయికి చేరుకోవచ్చని’ సుమిత్ వెల్లడించారు.


Next Story

Most Viewed