శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి పున:ప్రారంభం

by  |
శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి పున:ప్రారంభం
X

దిశ, వెబ్‎డెస్క్ : నాగర్ కర్నూలు జిల్లాలోని శ్రీశైలం భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి పున:ప్రారంభం అయింది. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైన 1, 2 యూనిట్లను మంత్రి జగదీష్ రెడ్డి, సీఎండీ ప్రభాకర్ రావు ప్రారంభించారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. మిగతా నాలుగు యూనిట్లలో త్వరలోనే విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 20వ తేదీన శ్రీశైలం పవర్ హౌస్‎లో షార్ట్ సర్క్యూట్‎తో ప్రమాదం జరిగి 9మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. రెండు నెలల అనంతరం విద్యుత్ ఉత్పత్తి తిరిగి ప్రారంభమైంది.
Next Story

Most Viewed