- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ కథనానికి స్పందన.. సొసైటీ చైర్మన్ పై కేసు నమోదు
<p>దిశ, నర్సంపేట: విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ను పరుష పదజాలంతో దూషించిన నర్సంపేట పీఏసీఎస్ సొసైటీ చైర్మన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ‘నా కార్ ఫోటో తీస్తావా’ అంటూ శనివారం ఉదయం దిశ ఓ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వైరల్ అయిన ఈ సంఘటనపై వరంగల్ సీపీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో సొసైటీ చైర్మన్ మొరాల మోహన్ రెడ్డిపై చర్యలు […]</p>

X
దిశ, నర్సంపేట: విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ను పరుష పదజాలంతో దూషించిన నర్సంపేట పీఏసీఎస్ సొసైటీ చైర్మన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ‘నా కార్ ఫోటో తీస్తావా’ అంటూ శనివారం ఉదయం దిశ ఓ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వైరల్ అయిన ఈ సంఘటనపై వరంగల్ సీపీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో సొసైటీ చైర్మన్ మొరాల మోహన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. నర్సంపేట ఏసీపీ ఫణీందర్ మాట్లాడుతూ… కానిస్టేబుల్ విధులకు ఆటంకం కలిగించినందుకు అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిబంధనలు పాటించకుండా, పోలీసులను విధులు నిర్వహించకుండా అడ్డుపడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
Next Story






