- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మురుగులో జీవించ మంటారా.. అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళన..
<p>దిశ, నిజాంపేట్: నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 2 వ డివిజన్ లోని జీపీఆర్ లేఔట్ లెజెండ్ కాలనీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను అధికారులు, డివిజన్ కార్పొరేటర్ పట్టించుకోకపోవడం ఆవేదనను కలిగిస్తుందని ఆ కాలనీ ప్రజలు బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. భూగర్భ డ్రైనేజీ వ్యర్థాలు రోడ్ల వెంబడి ఏరులై పారుతున్నాయన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని.. ఎన్ని ఫిర్యాదులు చేసిన పట్టించుకోక పోవడం ఎంతవరకు సమంజసం అని కాలని వాసులు నిలదీశారు. మమ్మల్ని ఇలానే […]</p>

దిశ, నిజాంపేట్: నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 2 వ డివిజన్ లోని జీపీఆర్ లేఔట్ లెజెండ్ కాలనీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను అధికారులు, డివిజన్ కార్పొరేటర్ పట్టించుకోకపోవడం ఆవేదనను కలిగిస్తుందని ఆ కాలనీ ప్రజలు బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. భూగర్భ డ్రైనేజీ వ్యర్థాలు రోడ్ల వెంబడి ఏరులై పారుతున్నాయన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని.. ఎన్ని ఫిర్యాదులు చేసిన పట్టించుకోక పోవడం ఎంతవరకు సమంజసం అని కాలని వాసులు నిలదీశారు. మమ్మల్ని ఇలానే మురుగులో జీవించమంటారా అని అధికారులను, ప్రజాప్రతినిధులును వారు ప్రశ్నించారు.

కాలనీ వాసుల సమస్యలు తెలుసుకున్న నిజాంపేట్ బీజేపీ నాయకులు బుధవారం లెజెండ్ కాలనీని సందర్శించి ఆ కాలనీవాసులకు మద్దతుగా నిలిచారు. కాలనీలో రాకపోకలు సైతం వీలు లేకుండా రోడ్ల పై రోత వ్యర్థాలు పారుతూ కాలనీలో అపరిశుభ్రత చోటుచేసుకుందని తెలిపారు. వెంటనే అధికారులు ఇక్కడి సమస్య నుండి కాలనీ ప్రజలకు విముక్తి కల్పించాలని కోరారు. సమస్యలను పరిష్కరించని పక్షంలో ప్రజా ఆగ్రహం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ బీజేపీ అధ్యక్షుడు సతీష్, ఫ్రొపెసర్ చంద్రమౌళి, కాలనీ వాసులు ముఖేష్, రంగనాయకులు, శ్రీనాథ్, మురళీ కృష్ణ, ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






