ఎఫెక్టివ్ ఎనర్జీ కోసం అల్యూమినియం బ్యాటరీస్

77

దిశ, ఫీచర్స్ : ప్రజెంట్ మార్కెట్‌లో లిథియం బ్యాటరీలకు ఫుల్ డిమాండ్ ఉంది. మార్కెట్‌ను ఇవే శాసిస్తున్నాయి. అయితే స్లోగా చార్జ్ అవుతుండటంతో పాటు ప్రమాదవశాత్తు పేలిపోవడం వంటి ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో వీటికి ప్రత్యామ్నాయంగా తక్కువ ధరకే లభించే రీచార్జబుల్ బ్యాటరీలను రూపొందించిన పరిశోధకులు.. ఇవి సేఫ్ ప్లస్ ఎన్విరాన్‌మెంట్ ఫ్రెండ్లీ‌ బ్యాటరీలని చెబుతున్నారు.

న్యూయార్క్ కార్నెట్ యూనివర్సిటీ పరిశోధకులు లిథియం బ్యాటరీలకు ప్రత్యామ్నాయంగా అల్యూమినియంను ఉపయోగించి రీచార్జబుల్ బ్యాటరీలు రూపొందించారు. కార్నెల్ యూనివర్సిటీ డీన్, ప్రొఫెసర్ లిండెన్ ఆర్చర్ నేతృత్వంలోని రీసెర్చర్స్.. ఎఫెక్టివ్ ఎనర్జీ స్టోరేజ్ కోసం అల్యూమినియం మూలకాన్ని ఉపయోగించి తయారు చేసిన బ్యాటరీ 10 వేల ఎర్రర్ ఫ్రీ సైకిల్స్ పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. ఈ న్యూ టెక్నిక్ ఆధారంగా రూపొందించిన బ్యాటరీలకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన స్టడీ సైంటిఫిక్ జర్నల్ ‘నేచర్ ఎనర్జీ’లో తాజాగా ప్రచురితమైంది. లిథియం బ్యాటరీతో పోల్చితే ఈ బ్యాటరీ ధనాత్మకత (ఆనోడ్) వల్ల ఎనర్జీ స్టోరేజ్ ఎక్కువగా ఉంటుందని, బ్యాటరీ ఫెయిల్ అయ్యే చాన్సెస్ తక్కువగా ఉంటాయని చెప్పారు. ఈ అల్యూమినియం ఆనోడ్ బ్యాటరీలను ప్రాక్టికల్ కండిషన్స్‌లో టెస్టింగ్ చేశామని, ఎఫెక్టివ్‌గా వర్క్ చేస్తున్నాయని పేర్కొన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..