మెడికల్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే ?

by  |
job-notification
X

దిశ, మంచిర్యాల: జాతీయ ఆరోగ్య మిషన్ క్రింద జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 38 వైద్యాధికారుల పోస్టులను ఒప్పందం ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ఎం.బి.బి.ఎన్. అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు ఫారం, నోటిఫికేషన్ వివరాలను జిల్లా అధికారిక వెబ్ సైట్ https://mancherial.telangana.gov.in లో పొందుపర్చడం జరిగిందని తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తు ఫారములు ఈ నెల 28వ తేదీ ఉదయం 10.30 గం||ల నుండి అక్టోబర్ 12వ తేదీ సాయంత్రం 5 గllల లోపు కార్యాలయ పనివేళలలో అందించాలని అన్నారు. జిల్లాలోని చందనాపూర్ గ్రామంలో గల జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హత గల అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.


Next Story

Most Viewed