- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ పోస్టులను భర్తీ చేయండి: కలెక్టర్
<p>దిశ, ఆదిలాబాద్: ‘సమయ పాలన పాటించి.. పూర్తిగా నమ్మకం కలిగేలా పనిచేయండి.. అక్కడికి వెళ్లి వారు ఆర్థికంగా నష్టపోవొద్దని అవగాహన కల్పించండి.. అవి వంద శాతం ఇక్కడే జరగాలి’ అని జిల్లా కలెక్టర్ చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలపై వైద్యాధికారులతో కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ సమీక్ష నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలలో గర్భిణిల నమోదు, జరుగుతున్న ప్రసవాలపై మండలాల వారీగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని […]</p>

దిశ, ఆదిలాబాద్: ‘సమయ పాలన పాటించి.. పూర్తిగా నమ్మకం కలిగేలా పనిచేయండి.. అక్కడికి వెళ్లి వారు ఆర్థికంగా నష్టపోవొద్దని అవగాహన కల్పించండి.. అవి వంద శాతం ఇక్కడే జరగాలి’ అని జిల్లా కలెక్టర్ చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలపై వైద్యాధికారులతో కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ సమీక్ష నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలలో గర్భిణిల నమోదు, జరుగుతున్న ప్రసవాలపై మండలాల వారీగా చర్చించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో అధిక సంఖ్యలో ప్రసవాలు జరిగేలా డాక్టర్లు, ఏఎన్ ఎంలు, ఆశా వర్కర్లు కృషి చేయాలన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు పనిచేయాలని.. అందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని, ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను భర్తీ చేయాలని జిల్లా వైద్యాధికారి డా. వసంత్ రావును ఆదేశించారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని, ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులపై పూర్తి నమ్మకం కలిగేలా డాక్టర్లు పనిచేయాలన్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలకు వెళ్లి ఆర్థికంగా నష్ట పోవొద్దని ప్రజలకు వైద్యసిబ్బంది అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. దేవేందర్ రెడ్డి, డా, కార్తీక్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.






