#21 years of Badri.. క్యూట్ ఫోటో పోస్ట్ చేసిన రేణు దేశాయ్

by  |
#21 years of Badri.. క్యూట్ ఫోటో పోస్ట్ చేసిన రేణు దేశాయ్
X

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో మైలు రాయి లాంటి సినిమా ఏది అంటే వెంటనే ‘బద్రి’ గుర్తొస్తుంది. ‘నువ్వు నందా అయితే .. నేను బద్రి .. బద్రీనాధ్’. ఈ ఒక్క డైలాగు ఇప్పటికి సోషల్ మీడియా లో మారుమ్రోగుతూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ని ఒక మాస్ స్టైల్ లో చూపించాడు పూరి జగన్నాద్. ఈ సినిమా చాలామందికి ప్రత్యేకమో, కాదో తెలియదు కానీ ‘బద్రి’ హీరోయిన్, పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ కి మాత్రం చాలా ప్రత్యేకమనే చెప్పాలి. ఈ చిత్రంతోనే రేణు తెలుగు తెరకు పరిచయమయ్యింది… ఈ షూటింగ్ లోనే పవన్ – రేణు ప్రేమాయణం మొదలయ్యి .. పెళ్ళికి దారి తీసింది. అందుకే ఆమెకు ఈ సినిమా చాలా ప్రత్యేకం.

అయితే ఈ సినిమా నేటికీ 21 ఏళ్ళు పూర్తీ చేసుకుంది. ఈ సందర్భంగా రేణు ‘బద్రి’ సెట్ లోని ఒక అపురూప చిత్రాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది. చికితా .. గుమస్తాస్ సాంగ్ షూట్ మధ్యలో పవన్ కళ్యాణ్ తో కలిసి దిగిన ఫోటోను ఆమె షేర్ చేసింది. “నా దుప్పట్టానే.. నా సన్‌స్క్రీన్.. చికితా షూట్ సమయంలో ఫోటోబాంబింగ్ జరుగుతున్నప్పుడు” అంటూ క్యాప్షన్ పెట్టింది. ఇక ఈ ఫోటో లో పవన్ గన్ పట్టుకొని ఉండగా .. రేణు ఎండలో తన దుపట్టాను ముఖంపై వేసుకొని ఫొటోకు ఫోజ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక కొన్ని కారణాల వలన రేణు, పవన్ తో విడిపోయి పిల్లలతో ఒంటరిగా ఉంటున్న విషయం తెలిసిందే.



Next Story