- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చనిపోయిన వారిని కూడా వదలని అక్రమార్కులు.. పోలీసులు ఎంట్రీతో సీన్ రివర్స్
<p>దిశ, కంది: గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేసిన ఇద్దరు వ్యక్తులను రిమాండ్ చేసినట్లు ఇంద్రకరణ్ ఎస్సై రాజేష్ నాయక్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. 2015 వ సంవత్సరంలో కంది మండలం కాశీపూర్‌కు చెందిన షాపురం శంకరయ్య మృతి చెందాడు. దీనితో పంచాయతీ కార్యదర్శి పద్మ డెత్ సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ సర్టిఫికేట్‌లో షాపురం శంకరయ్య పేరును మార్చిన పండరిగౌడ్ అనే వ్యక్తి తన పేరును వ్రాసుకొని భూమిని రిజిస్టర్ చేసుకున్నారు. […]</p>

X
దిశ, కంది: గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేసిన ఇద్దరు వ్యక్తులను రిమాండ్ చేసినట్లు ఇంద్రకరణ్ ఎస్సై రాజేష్ నాయక్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. 2015 వ సంవత్సరంలో కంది మండలం కాశీపూర్‌కు చెందిన షాపురం శంకరయ్య మృతి చెందాడు. దీనితో పంచాయతీ కార్యదర్శి పద్మ డెత్ సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ సర్టిఫికేట్‌లో షాపురం శంకరయ్య పేరును మార్చిన పండరిగౌడ్ అనే వ్యక్తి తన పేరును వ్రాసుకొని భూమిని రిజిస్టర్ చేసుకున్నారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి పద్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పద్మ ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు ఫోర్జరికి పాల్పడిన పండరి గౌడ్, మహేందర్ గౌడ్ లను మంగళవారం రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.
Next Story






