- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.11లక్షల కోట్లు!
by Harish |
<p>ముంబయి: ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు గురువారం నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో రూ.1,653.75 రికార్డును తాకింది. జీవితకాల గరిష్ఠాన్ని చేరుకోవడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ మార్కెట్ విలువ రూ.11లక్షల కోట్లకు చేరింది. ఉదయం ప్రారంభంలో రూ. 1605.55 వద్ద ట్రేడింగ్ మొదలై మధ్యాహ్నం తర్వాత కొనుగోళ్లు పెరిగి రూ. 1665 వరకు చేరినప్పటికీ తర్వాత 1653.75 వద్ద సరికొత్త గరిష్ఠాన్ని నమోదు చేసింది. దీంతో రిలయన్స్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.11లక్షల కోట్లకు చేరుకుంది. […]</p>

X
ముంబయి: ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు గురువారం నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో రూ.1,653.75 రికార్డును తాకింది. జీవితకాల గరిష్ఠాన్ని చేరుకోవడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ మార్కెట్ విలువ రూ.11లక్షల కోట్లకు చేరింది. ఉదయం ప్రారంభంలో రూ. 1605.55 వద్ద ట్రేడింగ్ మొదలై మధ్యాహ్నం తర్వాత కొనుగోళ్లు పెరిగి రూ. 1665 వరకు చేరినప్పటికీ తర్వాత 1653.75 వద్ద సరికొత్త గరిష్ఠాన్ని నమోదు చేసింది. దీంతో రిలయన్స్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.11లక్షల కోట్లకు చేరుకుంది. ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ కంపెనీగా రిలయన్స్ రికార్డు నమోదు చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ గడిచిన మూడు నెలల్లో ఏకంగా 80శాతం పెరిగింది. ఇటీవల 10 విదేశీ పెట్టుబడి సంస్థల నుంచి రిలయన్స్ అనుబంధంగా ఉన్న జియోలో ఇన్వెస్ట్‌మెంట్స్ వచ్చాయి.
Next Story






