ఏపీలో ఇంటర్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల

by Vemula.Srinu Prasad |

<p>దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో ఇంటర్మీడియెట్‌ అడ్వాన్సు సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఇంటర్మీడియెట్‌ ఫస్టియర్, సెకండియర్‌ విద్యార్థులకు సెప్టెంబర్‌ 15 నుంచి 23వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలను బోర్డు నిర్వహించింది. విద్యార్థులు &#8216;https:bie.ap.gov.in&#8217; ద్వారా తమ ఫలితాలను చూసుకోవడంతోపాటు షార్ట్ మార్కుల మెమోలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఫలితాలకు సంబంధించిన గ్రీవెన్స్‌ను &#8216;[email protected]&#8221; ద్వారా లేదా 391282578 వాట్సాప్‌ నంబర్లకు సంప్రదించవచ్చని తెలిపారు. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 2 వరకు [&hellip;]</p>

ఏపీలో ఇంటర్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో ఇంటర్మీడియెట్‌ అడ్వాన్సు సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఇంటర్మీడియెట్‌ ఫస్టియర్, సెకండియర్‌ విద్యార్థులకు సెప్టెంబర్‌ 15 నుంచి 23వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలను బోర్డు నిర్వహించింది. విద్యార్థులు ‘https:bie.ap.gov.in’ ద్వారా తమ ఫలితాలను చూసుకోవడంతోపాటు షార్ట్ మార్కుల మెమోలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఫలితాలకు సంబంధించిన గ్రీవెన్స్‌ను ‘[email protected]” ద్వారా లేదా 391282578 వాట్సాప్‌ నంబర్లకు సంప్రదించవచ్చని తెలిపారు. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 2 వరకు రీ వాల్యుయేషన్, రీ కౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు అధికారులు స్పష్టం చేశారు. అయితే రీ కౌంటింగ్‌కు రూ. 260, రీ వాల్యుయేషన్, స్కాన్ కాపీని పొందేందుకు రూ. 1300 చెల్లించాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు.

Next Story