- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహాలక్ష్మి ఆలయ పునఃనిర్మాణానికి నిధుల విడుదల
by Chintha Aamani |
<p>దిశ, నిర్మల్ కల్చరల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్ పేట్ శివారులోని పురాతన ఆలయమైన మహాలక్ష్మి అమ్మవారి ఆలయ నిర్మాణానికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. కోటి రూపాయల నిధులను మంజూరు చేశారు. ఈ మేరకు ఆలయ కమిటీ చైర్మన్ కొడుకల గంగాధర్, కౌన్సిలర్ బిట్లింగు నవీన్ తెలిపారు. వచ్చే సంవత్సరం మార్చి నాటికి ఆలయాన్ని పూర్తిచేస్తామని అధికారులు పేర్కొన్నారు. దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని నూతనంగా నిర్మించనున్న ఆలయం నమూనా చిత్రాన్ని దేవాదాయశాఖ […]</p>

X
దిశ, నిర్మల్ కల్చరల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్ పేట్ శివారులోని పురాతన ఆలయమైన మహాలక్ష్మి అమ్మవారి ఆలయ నిర్మాణానికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. కోటి రూపాయల నిధులను మంజూరు చేశారు.
ఈ మేరకు ఆలయ కమిటీ చైర్మన్ కొడుకల గంగాధర్, కౌన్సిలర్ బిట్లింగు నవీన్ తెలిపారు. వచ్చే సంవత్సరం మార్చి నాటికి ఆలయాన్ని పూర్తిచేస్తామని అధికారులు పేర్కొన్నారు. దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని నూతనంగా నిర్మించనున్న ఆలయం నమూనా చిత్రాన్ని దేవాదాయశాఖ అధికారులు విడుదల చేశారు.
Next Story






