- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మాడ్రిడ్ ఓపెన్ రద్దు చేయండి’
<p>దిశ, స్పోర్ట్స్: కరోనా మహమ్మారి కారణంగా మరో టెన్నిస్ టోర్నీ రద్దు కాబోతున్నది. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో జరిగే టెన్నిస్ టోర్నీని రద్దు చేయాలని స్థానిక ప్రభుత్వం ఆదేశించిది. ఈ ఏడాది మేలో నిర్వహించాల్సిన మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా సెప్టెంబర్ 12 నుంచి 20కి వాయిదా వేస్తున్నట్లు గతంతో పేర్కొన్నారు. కాగా, ఇప్పటికీ వైరస్ ప్రభావం తగ్గకపోవడంతో ఈ టోర్నమెంట్‌ను పూర్తిగా రద్దు చేయాలని మాడ్రిడ్ నగర పాలకులు నిర్వాహకులను […]</p>

దిశ, స్పోర్ట్స్: కరోనా మహమ్మారి కారణంగా మరో టెన్నిస్ టోర్నీ రద్దు కాబోతున్నది. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో జరిగే టెన్నిస్ టోర్నీని రద్దు చేయాలని స్థానిక ప్రభుత్వం ఆదేశించిది. ఈ ఏడాది మేలో నిర్వహించాల్సిన మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా సెప్టెంబర్ 12 నుంచి 20కి వాయిదా వేస్తున్నట్లు గతంతో పేర్కొన్నారు. కాగా, ఇప్పటికీ వైరస్ ప్రభావం తగ్గకపోవడంతో ఈ టోర్నమెంట్‌ను పూర్తిగా రద్దు చేయాలని మాడ్రిడ్ నగర పాలకులు నిర్వాహకులను ఆదేశించారు. ఈ మేరకు తమకు ఆదేశాలు జారీ అయినట్లు నిర్వాహకులు శనివారం వెల్లడించారు. కాగా, కరోనా ప్రభావం తగ్గుతుందని గతంలో ఈ టోర్నీని మే నుంచి సెప్టెంబర్‌కు వాయిదా వేశారు. కానీ ఇప్పటికీ స్పెయిన్‌లో పరిస్థితులు కుదుటపడలేదు. నిత్యం 2వేల కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే స్పెయిన్ వ్యాప్తంగా 2.8లక్షల కేసులు నమోదయ్యాయి. అందుకే ఈ సారి టోర్నీని రద్దు చేయాలని స్థానిక ప్రభుత్వం సూచించింది. యూఎస్ ఓపెన్ ఫైనల్ జరిగే రోజే ఈ టోర్నీ ప్రారంభించాల్సి ఉంది. కానీ ఇప్పుడు మాడ్రిడ్ స్థానిక ప్రభుత్వ ఆదేశంతో టోర్నీ సందిగ్దంలో పడింది.






