రెజీనా 'నేనే నా' ఫస్ట్ లుక్

by  |
రెజీనా నేనే నా ఫస్ట్ లుక్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఎవరు’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నా హీరోయిన్ రెజీనా. కెరియర్ తొలినాళ్లలో గ్లామర్ పాత్రలు చేసినా… తర్వాత నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ వస్తోంది. హిందీలోనూ ‘ఏక్ లడ్ కీ కో దేఖాతో ఐసా లగా’ చిత్రంలో లెస్బియన్‌గా నటించింది. ఈ చిత్రంలో నటనకు హిందీలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న రెజీనా.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ మూవీ చేస్తోంది. కార్తిక్ రాజు దర్శకత్వంలో వస్తున్న ‘నేనే నా’ సినిమాలో లీడ్ రోల్ చేస్తోంది. తమిళ్‌లో ‘సూర్పనగై’గా వస్తున్న సినిమా ఫస్ట్ లుక్, పోస్టర్‌ను హీరో విజయ్ సేతుపతి రిలీజ్ చేశాడు. పోస్టర్ టెర్రిఫిక్‌గా ఉందంటూ ట్వీట్ చేశాడు. ఆపీల్ స్టూడియోస్ బ్యానర్‌పై రాజశేఖర్ వర్మ నిర్మిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిశోర్ కీలక పాత్ర చేస్తున్నాడు. శ్యామ్ సీఎస్ మ్యూజిక్ అందిస్తున్నారు. పోస్టర్‌లో మహారాణిగా కనిపిస్తున్న రెజీనా… పవర్ ఫుల్‌గా ఉన్నా తెలియని బాధ వెంటాడుతున్నట్లు కనిపిస్తుంది.


Next Story

Most Viewed