పండుగ వేళ మహిళలకు గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం

by Vadlamudi Anukaran |

<p>దిశ, డైనమిక్ బ్యూరో : బంగారం అంటే ఇష్టపడనివారుండరు. అందుకే బంగారం ధరలు పెరిగినా కొనేందుకు ప్రజలు వెనకాడరు. ముఖ్యంగా తెలుగు ప్రజలు ఏ ఉత్సవమైనా.. శుభకార్యమైనా.. పండుగలైనా ఎంతో కొంత బంగారాన్ని కొంటుంటారు. రానున్న విజయదశమి సందర్భంగా ఎక్కువ మంది ప్రజలు బంగారం కొనుగోలు చేసేందుకు ఇష్టపడతుంటారు. ఈ క్రమంలో బంగారం దుకాణాలన్నీ ఇప్పటికే కిటకిటలాడుతున్నాయి. అయితే, పండుగ సందర్భంగా బంగారం కొనే వారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. బంగారం, వెండి ధరలు సోమవారం [&hellip;]</p>

పండుగ వేళ మహిళలకు గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం
X

దిశ, డైనమిక్ బ్యూరో : బంగారం అంటే ఇష్టపడనివారుండరు. అందుకే బంగారం ధరలు పెరిగినా కొనేందుకు ప్రజలు వెనకాడరు. ముఖ్యంగా తెలుగు ప్రజలు ఏ ఉత్సవమైనా.. శుభకార్యమైనా.. పండుగలైనా ఎంతో కొంత బంగారాన్ని కొంటుంటారు. రానున్న విజయదశమి సందర్భంగా ఎక్కువ మంది ప్రజలు బంగారం కొనుగోలు చేసేందుకు ఇష్టపడతుంటారు. ఈ క్రమంలో బంగారం దుకాణాలన్నీ ఇప్పటికే కిటకిటలాడుతున్నాయి. అయితే, పండుగ సందర్భంగా బంగారం కొనే వారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. బంగారం, వెండి ధరలు సోమవారం తగ్గాయి. హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర దాదాపు రూ.130 తగ్గి.. రూ.48,350 ఉండగా.. కిలో వెండి ధర రూ.100 వరకు తగ్గి రూ.63,270 వద్ద ఉంది.

Next Story