- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్: కొండదిగిన కోడి ధర
<p>దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఈ మధ్య ఉత్పత్తి లేక చికెన్ ధర అమాంతం ఆకాశానికి ఎక్కింది. నెల రోజుల క్రితం కిలో చికెన్ ధర రూ.270 వరకు ఉండేది. దీంతో చికెన్ తప్పకుండ తినాల్సి వస్తుందనుకున్నవారు, ముక్క లేకుండా ముద్ద దిగదు అనుకునేవారు ఎంత రేటు ఉన్నా కొనేస్తున్నారు. ఇక మే నెలలో పెళ్లిళ్లు, వేడుకలు కరోనా కారణంగా వాయిదా పడడంతో చికెన్ ధర కొండ దిగొచ్చింది. ఉత్పత్తి ఎక్కువగా ఉండడంతో చికెన్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఈ మధ్య ఉత్పత్తి లేక చికెన్ ధర అమాంతం ఆకాశానికి ఎక్కింది. నెల రోజుల క్రితం కిలో చికెన్ ధర రూ.270 వరకు ఉండేది. దీంతో చికెన్ తప్పకుండ తినాల్సి వస్తుందనుకున్నవారు, ముక్క లేకుండా ముద్ద దిగదు అనుకునేవారు ఎంత రేటు ఉన్నా కొనేస్తున్నారు. ఇక మే నెలలో పెళ్లిళ్లు, వేడుకలు కరోనా కారణంగా వాయిదా పడడంతో చికెన్ ధర కొండ దిగొచ్చింది. ఉత్పత్తి ఎక్కువగా ఉండడంతో చికెన్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. కేవలం నెల రోజుల వ్యవధిలో వంద రూపాయలకు పైగా చికెన్ రేటు తగ్గింది. దీంతో చికెన్ ప్రియులు పండగ చేసుకుంటున్నారు. ఏప్రిల్‌లో రూ.270 దాకా వెళ్లి కిలో చికెన్ ధర.. ఈనెలలో రూ.150కు పడిపోయింది. తాజాగా ఒక కిలో చికెన్ రూ.150.. కాగా లైవ్ చికెన్ రూ. 100కి చేరింది. చికెన్ ధరలు తగ్గడంతో షాపులముందు చికెన్ ప్రియులు క్యూ కడుతున్నారు.
Next Story






