- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంక్రాంతికి ఇలా వస్తాడనుకోలేదు : జవాన్ ఫ్యామిలీ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీబ్యూరో : సంక్రాంతి సెలవులకు ఇంటికొస్తానని చెప్పాడు. కానీ ఇలా విగతజీవుడై వస్తాడని తెలీదంటూ ఆ జవాను భార్యా పిల్లలు కన్నీరు మున్నీరవుతున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం గడ్డకిందపల్లికి చెందిన మంచు రెడ్డెప్ప నాయుడు శనివారం జమ్మూ-కశ్మీర్ సరిహద్దులో చలికి తట్టుకోలేక మృతిచెందాడు. పద్నాలుగేళ్లుగా మిలిటరీలో జవానుగా చేస్తున్నాడు. తీవ్రమైన చలితో తొలుత అస్వస్థృతకు గురికావడంతో సహచరులు ప్రథమ చికిత్స చేశారు. పరిస్థితి మరింత క్షీణించడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అనంతరం హెలీకాప్టర్ ద్వారా […]</p>

X
దిశ, ఏపీబ్యూరో : సంక్రాంతి సెలవులకు ఇంటికొస్తానని చెప్పాడు. కానీ ఇలా విగతజీవుడై వస్తాడని తెలీదంటూ ఆ జవాను భార్యా పిల్లలు కన్నీరు మున్నీరవుతున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం గడ్డకిందపల్లికి చెందిన మంచు రెడ్డెప్ప నాయుడు శనివారం జమ్మూ-కశ్మీర్ సరిహద్దులో చలికి తట్టుకోలేక మృతిచెందాడు. పద్నాలుగేళ్లుగా మిలిటరీలో జవానుగా చేస్తున్నాడు. తీవ్రమైన చలితో తొలుత అస్వస్థృతకు గురికావడంతో సహచరులు ప్రథమ చికిత్స చేశారు.
పరిస్థితి మరింత క్షీణించడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అనంతరం హెలీకాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడు. రెడ్డెప్ప నాయుడుకు భార్య రెడ్డెమ్మ, కుమారుడు సాత్విక్, కుమార్తె నిశిత ఉన్నారు. మంగళవారం మృతదేహం గడ్డకిందపల్లికి చేరుకోనుందని కుటుంబ సభ్యులు తెలిపారు.
Next Story






