భార్య కళ్లలో ఆనందం కోసం.. జైలుకెళ్లిన భర్త

by Batti.Sumithra |

<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏ పని చేయాలన్నా దానికి బలమైన కారణాలు, సంకల్పాలు ఉండాల్సిన అవసరం లేదు. మనసుకు నచ్చి.. అవతలి వాళ్ల కళ్లలో ఆనందం కనిపిస్తే చాలు.. ఇట్టే చేసేయొచ్చు అని నిరూపించాడు ఓ దొంగ. చుట్టూ విలువైన వస్తువులు, కౌంటర్‌లో బోలెడంతా డబ్బు ఉన్నా వాటిని ముట్టుకోకుండా కేవలం ఒకే ఒక్క చీరను దొంగతనం చేశాడో యువకుడు. ఇంతకూ ఆ చీరలో అంత ప్రత్యేకత ఏమున్నది అనుకుంటున్నారా..? అయితే ఈ కథనం చదవండి. మధ్యప్రదేశ్‌లోని [&hellip;]</p>

Red shary
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏ పని చేయాలన్నా దానికి బలమైన కారణాలు, సంకల్పాలు ఉండాల్సిన అవసరం లేదు. మనసుకు నచ్చి.. అవతలి వాళ్ల కళ్లలో ఆనందం కనిపిస్తే చాలు.. ఇట్టే చేసేయొచ్చు అని నిరూపించాడు ఓ దొంగ. చుట్టూ విలువైన వస్తువులు, కౌంటర్‌లో బోలెడంతా డబ్బు ఉన్నా వాటిని ముట్టుకోకుండా కేవలం ఒకే ఒక్క చీరను దొంగతనం చేశాడో యువకుడు. ఇంతకూ ఆ చీరలో అంత ప్రత్యేకత ఏమున్నది అనుకుంటున్నారా..? అయితే ఈ కథనం చదవండి.

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని టవర్‌ చౌక్‌లోని ఓ చీరల దుకాణానికి యువకుడు వెళ్లాడు. అప్పటికే వస్త్ర దుకాణం కస్టమర్లతో బిజీగా ఉన్నది. అయితే షాపు లోపలికి వెళ్లిన యువకుడు నేరుగా డిస్ ప్లేలో పెట్టిన ఓ అందమైన చీరను తీసుకుని పరారీ కాబోయాడు. కానీ అతడిని షాపింగ్‌లో ఉన్న వ్యక్తులు అడ్డుకోబోయారు. దీంతో వెంటనే అతడు కత్తి బయటకు తీసి అందరిని బెదిరించాడు. అడ్డువచ్చిన వారిని తోసేస్తూ పరుగు అందుకున్నాడు. ఈ ఘటనతో వస్ర్త దుకాణం యజమాని షాక్ తిన్నాడు. కౌంటర్‌లో ఉన్న డబ్బులు, షాపులో ఉన్న బంగారాన్ని ముట్టుకోకుండా కేవలం చీరను ఎత్తుకెళ్లడం ఏంటోనని విస్తుపోయాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

సమాచారం అందుకున్న ఉజ్జయిని పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించి.. దొంగతనానికి పాల్పడింది పాత నేరస్తుడు విక్కీగా గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగిన దర్యాప్తు బృందం అతడిని 16 గంటల్లో అరెస్ట్ చేశారు. అతడిపై అతి కఠినమైన జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) సెక్షన్లను వినియోగించి కేసు నమోదు చేశారు. అయితే ఇంత చిన్న దొంగతనానికి అంతపెద్ద కేసా అంటూ ప్రజల నుంచి పోలీసులపై విమర్శలు వచ్చాయి. దీనిపై స్పందించిన పోలీసులు విక్కీపై ఇప్పటికే 16 కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. తరచూ చోరీలకు పాల్పడుతుండడంతోనే ఎన్ఎస్ఏ చట్టాన్ని ప్రయోగించామని వివరణ ఇచ్చారు.

అయితే నిందితుడు విక్కీ చీర దొంగతనంపై ఆసక్తికర విషయం వెల్లడించాడు. వస్త్ర దుకాణంలో డిస్ ప్లే చేసిన ఎర్ర చీర తనకు బాగా నచ్చిందని, దానిని తీసుకెళ్లి తన భార్యకు బహుమతిగా ఇవ్వాలని అనుకున్నట్లు పేర్కొన్నాడు. ఆ చీరలో ఆమె మెరిసి పోతుందని, నా గిఫ్ట్‌తో ఆమె కళ్లలో ఆనందాన్ని చూడాలని అనుకున్నట్లు పోలీసులకు వివరించాడు. కానీ అంతకు ముందే విక్కీ సీసీ కెమెరాల్లో మెరిసి పోలీసులకు చిక్కి జైలుపాలయ్యాడు.

Next Story