తెలంగాణలోని 14 జిల్లాల్లో రెడ్ అలర్ట్

75
Telangana

దిశ, డైనమిక్ బ్యూరో : గులాబ్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తెలంగాణలోని 14 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. రెడ్ జోన్‌లో నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, పెద్దపల్లి, కరీంనగర్, జనగామ, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు ఉన్నాయి. రెడ్ అలర్ట్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..