గులాబ్ గుబులు.. తెలంగాణలో ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్

by  |
rains
X

దిశ, వెబ్‌డెస్క్ : గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా తెలంగాణలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణా సర్కార్ అప్రమత్తం అయ్యింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారు జామున వరకూ పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం తడిసి ముద్దయింది. పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. నిర్మల్, నిజమాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. అలాగే మరో 17 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రెడ్ అలర్ట్ ప్రకటించిన ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని, లోతట్టు ప్రాంతాల ప్రజలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం కోరింది.


Next Story