- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వర్షం వచ్చాక వాసనకు ఇదే కారణం!
<p>దిశ, వెబ్‌డెస్క్: ఎండాకాలం తర్వాత మొదట వచ్చే వానలు తీసుకొచ్చే వాసనను ఇష్టపడనివారు ఉండరు. సిటీలో కాంక్రీటు జంగిల్లో ఈ వాసన పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు అందరూ ఊర్లలో ఉన్నారు కాబట్టి మొదటి వాన వాసన చూసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే ఈ వాసనకు కారణం ఏంటనే విషయాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. దీనికి ఓ బ్యాక్టీరియా కారణమని ఆస్ట్రేలియాకు చెందిన ఇద్దరు పరిశోధకులు కనుక్కున్నారు. స్ట్రెప్టోమైస్‌గా పిలిచే ఈ బ్యాక్టీరియా జియోస్మిన్ అనే […]</p>

దిశ, వెబ్‌డెస్క్:
ఎండాకాలం తర్వాత మొదట వచ్చే వానలు తీసుకొచ్చే వాసనను ఇష్టపడనివారు ఉండరు. సిటీలో కాంక్రీటు జంగిల్లో ఈ వాసన పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు అందరూ ఊర్లలో ఉన్నారు కాబట్టి మొదటి వాన వాసన చూసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే ఈ వాసనకు కారణం ఏంటనే విషయాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు.
దీనికి ఓ బ్యాక్టీరియా కారణమని ఆస్ట్రేలియాకు చెందిన ఇద్దరు పరిశోధకులు కనుక్కున్నారు. స్ట్రెప్టోమైస్‌గా పిలిచే ఈ బ్యాక్టీరియా జియోస్మిన్ అనే సమ్మేళనాన్ని విడుదల చేస్తుంది. ఈ జియోస్మిన్ వాసనకు ఆర్థ్రోపోడ్ వర్గానికి చెందిన చిన్న పురుగు స్ప్రింగ్‌టెయిల్ ఆకర్షణకు గురవుతుంది. ఈ రెండింటి మధ్య సమన్వయ సహజీవనం కారణంగా ఒక రకమైన రసాయనం పుడుతుంది. వర్షం వచ్చినపుడు ఈ రసాయనం కారణంగా వాసన వెలువడుతుందని శాస్త్రవేత్త బట్నర్ తెలిపారు. అయితే 1960ల్లో ఈ వాసనకు చెట్ల నుంచి వెలువడే ఒక రకమైన నూనె కారణమనే విషయం ప్రచారంలో ఉంది.
Tags: Bacteria, Rain smell, Streptomyce, Springtail






