అయ్యా కేటీఆర్ సారూ.. 21 రోజుల్లోనే అనుమతులన్నారు.. ఇంకా టైం కాలేదా..?

by Sridhar Babu |   (  Updated:2021-09-25 22:47:50  IST  )

<p>దిశ, ఖమ్మం రూరల్​ : సుడా పరిధిలో టీఎస్​బీపాస్​ కింద వెంచర్​లకు అనుమతులు ఇవ్వాలని రియల్​ ఎస్టేట్​ వ్యాపారి బాణోత్​ కిషోర్​ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం వరంగల్​ క్రాస్ ​రోడ్డు వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం టీఎస్​బీపాస్​కు ముందు డీటీసీపీ అనుమతితో వెంచర్​లు నిర్మించేవారమని, దానిని రద్ధు చేసి టీఎస్​బీపాస్​ను తీసుకువచ్చినా ఇంతవరకు ఖమ్మం జిల్లాలో అమలులోకి రాలేదన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో సమర్థవంతంగా అమలవుతున్న ధరణి.. ఖమ్మంలో మాత్రం ఎందుకు ఆలస్యం అవుతుందో అర్థంకావడం [&hellip;]</p>

అయ్యా కేటీఆర్ సారూ.. 21 రోజుల్లోనే అనుమతులన్నారు.. ఇంకా టైం కాలేదా..?
X

దిశ, ఖమ్మం రూరల్​ : సుడా పరిధిలో టీఎస్​బీపాస్​ కింద వెంచర్​లకు అనుమతులు ఇవ్వాలని రియల్​ ఎస్టేట్​ వ్యాపారి బాణోత్​ కిషోర్​ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం వరంగల్​ క్రాస్ ​రోడ్డు వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం టీఎస్​బీపాస్​కు ముందు డీటీసీపీ అనుమతితో వెంచర్​లు నిర్మించేవారమని, దానిని రద్ధు చేసి టీఎస్​బీపాస్​ను తీసుకువచ్చినా ఇంతవరకు ఖమ్మం జిల్లాలో అమలులోకి రాలేదన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో సమర్థవంతంగా అమలవుతున్న ధరణి.. ఖమ్మంలో మాత్రం ఎందుకు ఆలస్యం అవుతుందో అర్థంకావడం లేదన్నారు.

దీని వలన మా లాంటి వ్యాపారులు రోడ్డుమీద పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 21రోజుల్లో అనుమతులు ఇస్తామని తెలిపిన ప్రభుత్వం, నెలలు గడుస్తున్నా అతిగతిలేదన్నారు. టీఎస్ బీపాస్ తెచ్చిన కొత్తల్లో ఇలాంటి పాలసీ ఎక్కడా లేదని.. సీఎం కేసీఆర్, తనయుడు కేటీఆర్ పదే పదే ఊదర గొట్టారని.. 21రోజుల్లోనే అనుమతులు ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. ఇంకా టైం కాలేదా అని ప్రశ్నించారు.

తమను పట్టించుకునే నాధుడే లేడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంచర్​ ప్రారంభించి ఏడాది దాటుతోందన్నారు. నిబంధనల ప్రకారం అన్నిపత్రాలు సమకూర్చినా అనుమతులు మాత్రం ఇవ్వడం లేదని వాపోయారు. జిల్లా కలెక్టర్​ స్పందించి మా వంటి రియల్​ వ్యాపారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. సమావేశంలో షేక్​ హుస్సేన్​, షేక్​ లాల్​సాహెబ్​, ఎస్​కే మదార్​, మైబేలీ సాహెబ్​, మదార్​ తదితరులు పాల్గొన్నారు.

Next Story