- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుమానాస్పద స్థితిలో వ్యాపారి మృతదేహం.. అసలేమైంది..!
by Batti.Sumithra |
<p>దిశ, జవహర్నగర్: అనుమానాస్పదస్థితిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి మృతి చెందిన ఘటన జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానిక కౌకూర్ చెరువు వద్ద ఉన్న చెట్లపొదల్లో మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ సమాచారంతో సీఐ వెంకటేశ్వర్లు.. సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడు కంటోన్మెంట్ పరిధిలోని బొల్లారం ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నవీన్ రెడ్డిగా గుర్తించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టాలు రావడంతో అప్పుల బాధతో మనస్థాపానికి […]</p>

X
దిశ, జవహర్నగర్: అనుమానాస్పదస్థితిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి మృతి చెందిన ఘటన జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానిక కౌకూర్ చెరువు వద్ద ఉన్న చెట్లపొదల్లో మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ సమాచారంతో సీఐ వెంకటేశ్వర్లు.. సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడు కంటోన్మెంట్ పరిధిలోని బొల్లారం ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నవీన్ రెడ్డిగా గుర్తించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టాలు రావడంతో అప్పుల బాధతో మనస్థాపానికి గురై నవీన్ రెడ్డి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. గతంలో కూడా ఒకసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి కి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Next Story






