- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంఎస్ఎన్ పరిశ్రమలో పేలిన రియాక్టర్
<p>దిశ, పటాన్ చెరు: పారిశ్రామికవాడలోని రుద్రారం ఎన్ఎస్ఎల్ పరిశ్రమలో గ్యాస్ లీకై రియాక్టర్ పేలడంతో ముగ్గురు కార్మికులకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. పటాన్ చెరు మండలం రుద్రారం పరిధిలోని ఎంఎస్ఎన్ ల్యాబోరేటరీస్ పరిశ్రమలో శనివారం రియాక్టర్ దగ్గర గ్యాస్ లీక్ అవడంతో రియాక్టర్ ఒక్కసారిగా పేలింది. రియాక్టర్ దగ్గర విధులు నిర్వర్తిస్తున్న కార్మికులు సురేందర్‌నాథ్ రెడ్డి(33), లక్ష్మణ్ రావు(35), అంబేద్కర్(36) లకు గాయాలయ్యాయి. గాయపడ్డ కార్మికులను పరిశ్రమ యాజమాన్యం హుటాహుటిన నగరంలోని కంచన్ బాబు అపోలో ఆసుపత్రికి […]</p>

దిశ, పటాన్ చెరు: పారిశ్రామికవాడలోని రుద్రారం ఎన్ఎస్ఎల్ పరిశ్రమలో గ్యాస్ లీకై రియాక్టర్ పేలడంతో ముగ్గురు కార్మికులకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. పటాన్ చెరు మండలం రుద్రారం పరిధిలోని ఎంఎస్ఎన్ ల్యాబోరేటరీస్ పరిశ్రమలో శనివారం రియాక్టర్ దగ్గర గ్యాస్ లీక్ అవడంతో రియాక్టర్ ఒక్కసారిగా పేలింది. రియాక్టర్ దగ్గర విధులు నిర్వర్తిస్తున్న కార్మికులు సురేందర్‌నాథ్ రెడ్డి(33), లక్ష్మణ్ రావు(35), అంబేద్కర్(36) లకు గాయాలయ్యాయి. గాయపడ్డ కార్మికులను పరిశ్రమ యాజమాన్యం హుటాహుటిన నగరంలోని కంచన్ బాబు అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం తెలుసుకున్న డీఎస్పీ భీమ్ రెడ్డి, సీఐ వేణుగోపాల్ రెడ్డి, ఎస్ఐ ప్రసాద్ రావు, రెవెన్యూ సిబ్బంది పరిశ్రమకు వెళ్లి ఘటనపై వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. పరిశ్రమల్లో సరైన భద్రతలు పాటించకపోవడంతో నిత్యం ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. పరిశ్రమ యజమాన్యం తప్పిదాలకు కార్మికులు ఇబ్బందులు పడుతూ ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా పిసిబి అధికారులు పరిశ్రమలపై నిఘా పెట్టాలని, సరైన నిబంధనలు పాటించని పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రియాక్టర్ పేలుడు ఘటనపై సీఐ వేణుగోపాల్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.






