కదిలిన ప్రగతిరథ చక్రాలు

by  |
కదిలిన ప్రగతిరథ చక్రాలు
X

దిశ, వెబ్ డెస్క్: లాక్ డౌన్ కారణంగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు హైదరాబాద్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కాయి. తెల్లవారు జామునుంచే బస్సులు ప్లాట్ ఫాంలపైకి వచ్చాయి. రాత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నిబంధనలకు అనుగుణంగా బస్సులు నడిపిస్తామని ప్రకటించారు. దీంతో ఆర్టీసీ బస్ స్టేషన్ల నుంచి వివిధ ప్రాంతాలకు ప్రయాణీకులను చేరవేసే ప్రక్రియ చేపట్టాయి. దాదాపు రెండు నెలల తరువాత బస్సులు ప్రారంభం కావడంతో సామాన్యులకు ఊరట కల్గినట్టయింది. మొదట ప్రయాణీకుల రద్దీ కొంత తక్కువగానే ఉన్నా క్రమక్రమంగా వివిధ ప్రాంతాలకు వెళ్లేవారు బస్ స్టాండ్ కు చేరుకుంటున్నారు. కరీంనగర్ బస్టాండ్ నుంచి ఉదయం 8 గంటల వరకు 20 బస్సులు ప్రయాణికులను చేరవేశాయి.

Next Story