ATM కస్టమర్లకు భారీ షాక్.. అమల్లోకి RBI కొత్త నిబంధనలు..!

by  |
atm-new-rules
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో బ్యాంకింగ్, ఆర్థిక సేవా రంగాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏటీఎం వినియోగదారులకు భారీ షాక్ తగలనుంది. ఇటీవల రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా సవరించిన కొత్త నిబంధనలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. తమ కస్టమర్లకు ఏటీఎం కార్డు సర్వీసులను ప్రొవైడ్ చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు ఇంటర్ సర్వీస్ చార్జీలను పెంచాలని ఆర్బీఐకు వినతి చేశాయి. ఏటీఎం కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ భారంగా మారిన నేపథ్యంలోనే ఈ ప్రపొసల్‌ను RBI ముందు ఉంచినట్లు సమాచారం.

తాజాగా బ్యాంకుల చేసిన వినతికి ఆర్బీబీ అనుమతించింది. దీంతో ATMలో ఆర్థిక లావాదేవీలపై ఫీజు రూ.15 నుంచి 17నకు పెంచుకునే అవకాశం కల్పించింది. ఆర్థికేతర లావాదేవీలపై ఫీజు రూ.5 నుంచి 6కు పెరిగింది. ఈ చార్జీలు సొంత బ్రాంచ్ ఏటీఎం నుంచి కాకుండా ఇతర బ్యాంకు ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునే వారికి వర్తించనున్నాయి. నేటి నుంచి సాధారణ సెలవు రోజుల్లోనూ ఖాతాల్లో వేతనాలు జమకానున్నాయి. అంతేకాకుండా నేటి నుంచి అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా గ్యాస్ ధరల పెరగనున్నాయి.


Next Story