ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.3 కోట్ల జరిమానా

by  |
ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.3 కోట్ల జరిమానా
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) రూ. 3 కోట్ల జరిమానా విధించినట్టు వెల్లడించింది. 2015, జులై నాటి బ్యాంకుల వర్గీకరణ, వాల్యూయేషన్, పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో నిర్వహణకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినందున బ్యాంకుకు రూ. 3 కోట్ల జరిమానా విధించినట్టు ఓ ప్రకటనలో తెలిపింది.

సెక్యూరిటీల బదిలీల విషయంలో నిబంధనలు విరుద్ధంగా ఉన్నట్టు ఆర్‌బీఐ వివరించింది. ఈ జరిమానా రెగ్యులేటరీ అంగీకారంపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది. అలాగే, ఆర్‌బీఐ జారీ చేసిన ఆదేశాలను పాటించడంలో విఫలమైన కారణంగా దానిపై జరిమానా ఎందుకు విధించకూడదో చెప్పాలని ఐసీఐసీఐ బ్యాంకుకు నోటీసులను జారీ చేసింది.



Next Story