- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన రాయల
<p>దిశ, ఖమ్మం టౌన్: ఖమ్మం ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రముఖ వ్యాపారవేత్త రాయల నాగేశ్వరరావు మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. జిల్లాలో ఉన్న పార్టీ శ్రేణుల పెద్ద ఎత్తున కలెక్టరేట్ ర్యాలీగా చేరుకున్న రాయల జిల్లా కలెక్టర్ కు వీపీ గౌతమ్ కు నామినేషన్ పత్రాన్ని అందజేశారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, పార్టీ నాయకులు పోట్లనగేశ్వరావు, ఖమ్మం నగర అధ్యక్షుడు జావిద్ లు మాట్లాడుతూ పార్టీ అధ్యక్షరాలు […]</p>

దిశ, ఖమ్మం టౌన్: ఖమ్మం ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రముఖ వ్యాపారవేత్త రాయల నాగేశ్వరరావు మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. జిల్లాలో ఉన్న పార్టీ శ్రేణుల పెద్ద ఎత్తున కలెక్టరేట్ ర్యాలీగా చేరుకున్న రాయల జిల్లా కలెక్టర్ కు వీపీ గౌతమ్ కు నామినేషన్ పత్రాన్ని అందజేశారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, పార్టీ నాయకులు పోట్లనగేశ్వరావు, ఖమ్మం నగర అధ్యక్షుడు జావిద్ లు మాట్లాడుతూ పార్టీ అధ్యక్షరాలు సోనియా గాంధీ ఆదేశాల ప్రకారం రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి ఆశీస్సులతో బీఫామ్ ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ అవలంబిస్తున్న నియంతృత్వ పోకడను అడ్డుకునేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర గ్రానైట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి రాయల రాజీనామా చేశారు. ఈ కార్యక్రమంలో నగర కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.






