క్రాక్ ఇన్ యాక్షన్.. కిక్ ఇచ్చిన మాస్ డైలాగ్

by  |
క్రాక్ ఇన్ యాక్షన్.. కిక్ ఇచ్చిన మాస్ డైలాగ్
X

దిశ, వెబ్‌డెస్క్: మాస్ మహారాజ రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘క్రాక్’. రవితేజ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్న సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్ కాగా.. ఈ మూవీతో సక్సెస్ ట్రాక్‌ ఎక్కాలని భావిస్తున్న రవితేజ. కరోనా కారణంగా ఇన్నాళ్లు వాయిదా పడిన షూటింగ్ రీస్టార్ట్ కాగా.. క్రాక్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది మూవీ యూనిట్. స్టార్ట్.. కెమెరా.. యాక్షన్ అనగానే.. ‘స్టేషన్‌లో ఉన్నప్పుడు ఫోన్ సైలెంట్ మోడ్‌లో పెట్టించి దొబ్బిచ్చుకో’ అన్న రవితేజ డైలాగ్ మేకింగ్ వీడియో ఫ్యాన్స్‌కు కిక్ ఇస్తోంది. ‘క్రాక్ ఇన్ యాక్షన్’ అంటూ రిలీజైన మాస్ ట్రీట్ వీడియో ట్రెండింగ్‌లో ఉండగా.. డైరెక్టర్స్ హరీష్ శంకర్, అనిల్ రావిపూడి మాస్ మహరాజ్ డైలాగ్ స్టైల్ అదిరిపోయిందని కాంప్లిమెంట్స్ ఇచ్చారు.

వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని బి. మధు నిర్మిస్తుండగా.. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే ఇప్పటికే సినిమా గురించి వెయిట్ చేస్తున్న రవితేజ ఫ్యాన్స్ దసరాకి మాత్రం కిక్ ఇచ్చే అప్‌డేట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.



Next Story

Most Viewed