‘ఖిలాడి’గా వస్తున్న మాస్ మహరాజ్

by  |
‘ఖిలాడి’గా వస్తున్న మాస్ మహరాజ్
X

దిశ, వెబ్‌డెస్క్ :

మాస్ మహారాజ రవితేజ కెరీర్‌లో మళ్లీ మునుపటి స్పీడ్ పెంచాడు. ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. గతంలో రమేష్ వర్మ దర్శకత్వంలో ‘వీర’ చేసిన రవితేజ.. మరోసారి ఆ దర్శకుడికి అవకాశం ఇచ్చాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ శనివారం విడుదల కాగా, తాజాగా ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్ రివీల్ చేసింది చిత్ర బృందం.

రవితేజ సినిమాల టైటిల్స్ అన్నీ కూడా తన ఎనర్జీని మ్యాచ్ చేసేలా ఉంటాయి. ఈ క్రమంలోనే రమేష్ వర్మ తన‌తో చేయబోతున్న చిత్రానికి ‘ఖిలాడి’ అనే టైటిల్ ఫిక్స్ చేశాడు. ఇందులో రవితేజ లుక్ కూడా తన ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా ఉంది. టాప్ టు బాటమ్ బ్లాక్ ఔట్‌ఫిట్స్‌తో చాలా స్టైలిష్‌గా ఉన్నాడు. అంతేకాదు.. రవితేజ మేకోవర్ చూస్తే నిజంగా యంగ్ అండ్ ఎనర్జటిక్‌గా కనిపిస్తున్నాడు. పోస్టర్ బ్యాక్‌గ్రౌండ్‌లో నోట్లన్నీ గాల్లో ఎగరడం చూస్తుంటే.. ఈ చిత్రం కూడా మైండ్ గేమ్, థ్రిల్లర్ తరహా కథాంశంతో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయాతి, మీనాక్షి చౌధురిని క‌థానాయిక‌లుగా నటిస్తున్నారు. రాక్షసుడు మూవీ నిర్మాత సత్యనారాయణ కొనేరు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ర‌వితేజ ప్ర‌స్తుతంగోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ అనే చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ఇప్పటికే తుది ద‌శ‌కు చేరుకుంది. అది పూర్తవగానే.. రవితేజ ఖిలాడీ టీమ్‌తో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది.

https://twitter.com/RaviTeja_offl/status/1317680864432513028


Next Story