చెన్నై క్యాంప్‌కు జడేజా దూరం

by  |
చెన్నై క్యాంప్‌కు జడేజా దూరం
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్(IPL) సన్నాహకాల్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తమ ఆటగాళ్ల కోసం చెన్నైలో ఒక ఫిట్‌నెస్ క్యాంప్ (Fitness camp) ఏర్పాటు చేసింది. ఆటగాళ్లందరినీ అక్కడకు పిలిచింది. ఆగస్టు 15నుంచి ఈ శిబిరం చేపాక్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు సీఎస్కే(CSK) సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపారు.

కాగా, వ్యక్తిగత కారణాల వల్ల రవీంద్ర జడేజా(Ravindra Jadeja) ఈ ఫిట్‌నెస్ శిబిరానికి హాజరు కాలేకపోతున్నట్లు కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. ఆగస్టు 21న దుబాయ్ బయలుదేరే రోజు జడేజా జట్టు(Team)తో కలుస్తాడని, కోచ్ మైఖేల్ హస్సీ(Michael Hussey) నేరుగా ఆగస్టు 22న జట్టుతో చేరతాడని ఆయన స్పష్టం చేశారు. ఈ శిబిరానికి ఎంఎస్ ధోనీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, హర్భజన్ సింగ్ హాజరవుతున్నట్లు సమాచారం


Next Story

Most Viewed