- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వక్కంతం వంశీకి ఓకే చెప్పిన మాస్ మహారాజా
<p>దిశ, వెబ్‌డెస్క్: మాస్ మహారాజ రవితేజ వరుస పరాజయాలు చవిచూస్తున్నాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ‘డిస్కో రాజా’ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. దీంతో అటు ఫ్యాన్స్ ఇటు హీరో చాలా ఫీలై పోయారు. కనీసం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ‘క్రాక్’తో అయిన కిరాక్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు రవితేజ. మే 8న సినిమా విడుదల కానుండగా… ఈ సారైన విజయాన్ని సాధించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. శృతి హాసన్ హీరోయిన్ కాగా… వరలక్ష్మి శరత్ కుమార్, […]</p>

దిశ, వెబ్‌డెస్క్: మాస్ మహారాజ రవితేజ వరుస పరాజయాలు చవిచూస్తున్నాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ‘డిస్కో రాజా’ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. దీంతో అటు ఫ్యాన్స్ ఇటు హీరో చాలా ఫీలై పోయారు. కనీసం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ‘క్రాక్’తో అయిన కిరాక్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు రవితేజ. మే 8న సినిమా విడుదల కానుండగా… ఈ సారైన విజయాన్ని సాధించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. శృతి హాసన్ హీరోయిన్ కాగా… వరలక్ష్మి శరత్ కుమార్, సముతిరఖని, రవిశంకర్‌లు ప్రధాన పాత్రలు చేస్తున్నారు.
అయితే ఎన్ని ఫ్లాపులు పడినా… రవితేజ కెరియర్‌కు మాత్రం ఢోకా లేదు. ఆయనతో పనిచేసేందుకు డైరెక్టర్లు క్యూ కడుతూనే ఉన్నారు. సినీ కథారచయితగా మంచి పేరు సంపాదించిన వక్కంతం వంశీ… రవితేజతో సినిమా చేసేందుకు రెడీ అయ్యారట. ‘నా పేరు సూర్య’ సినిమాతో దర్శకుడిగా మారిన ఆయన తొలి సినిమాతో డిజాస్టర్ చవిచూశారు. దీంతో రెండేళ్లు గ్యాప్ తీసుకున్న వంశీ… మంచి కథ రెడీ చేసుకుని రవితేజకు వినిపించాడట. ఈ కథకు ఫిదా అయిపోయిన మాస్ మహారాజా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు సమాచారం.
tags : Ravi Teja, Vakkantham Vamshi, Mass Maharaja, Krack, Gopichand Malineni






