మాస్ మహరాజ్ విత్ మారుతి..

16

దిశ, వెబ్ డెస్క్: మాస్ మహరాజ్ రవితేజ కెరియర్ ఢీలా పడిపోయింది. చాలా ఏళ్లుగా హిట్ లేక ఎదురుచూస్తున్న ఆయన సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ‘క్రాక్’ సినిమా ద్వారా ఎలాగైనా సూపర్ హిట్ అందుకోవాలని ట్రై చేస్తున్న మాస్ కా రాజా.. నెక్స్ట్ మూవీకి జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు.

మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్‌ను మెప్పిస్తూ హిట్ ట్రాక్‌లో ఉన్న డైరెక్టర్ మారుతి ట్రాక్‌లోకి వెళ్లాలని చూస్తున్నాడు రవితేజ. కామెడీ జోనర్‌లో కమర్షియల్ సినిమా తీస్తూ సక్సెస్ అవుతూ వస్తున్న మారుతితో సినిమా తీసేందుకు రెడీ అయినట్టు టాక్. ఇప్పటికే కథ కూడా విన్న హీరో.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు సమాచారం. గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ సినిమాను సంయుక్తంగా నిర్మించనుండగా.. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక సంగీతం విషయానికి వస్తే.. ప్రస్తుతం ఫుల్ డిమాండ్‌తో దూసుకుపోతున్న ఎస్.ఎస్. థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించనున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. మొత్తానికి టాలీవుడ్‌తో ఓ కొత్త కాంబినేషన్‌లో సినిమా రాబోతుందన్న మాట.