రమ్యకృష్ణ వద్దనుకుంది ఇంత పవర్‌ఫుల్ పాత్రనా?

by  |
రమ్యకృష్ణ వద్దనుకుంది ఇంత పవర్‌ఫుల్ పాత్రనా?
X

దిశ, వెబ్‌డెస్క్ : ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ ఇండియా మొత్తం వెయిట్ చేస్తున్న సినిమాల్లో ఒకటి. ‘కేజీఎఫ్’ మొదటి భాగం బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకోగా.. అంతకు మించిన కాన్సెప్ట్‌తో సీక్వెల్ వచ్చేస్తుంది. అమ్మ సెంటిమెంట్, గ్యాంగ్ వార్ నేపథ్యంలో సాగే సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై.. నేషనల్ లెవల్‌లో సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. కాగా చాప్టర్ 2 కూడా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసింది.

కాగా, ఇందులో కీలక పాత్రలో నటించిన బాలీవుడ్ నటి రవీనా టాండన్.. పుట్టినరోజు సందర్భంగా తన లుక్ రిలీజ్ చేస్తూ విషెస్ అందించింది మూవీ యూనిట్. రమిక సేన్‌గా తనను ఇంట్రడ్యూస్ చేసిన టీమ్.. తనకు బర్త్‌డే విషెస్ తెలిపింది. పోస్టర్ చూస్తుంటే రవీనా పవర్‌ఫుల్ రాజకీయ నాయకురాలి పాత్రలో కనిపించబోతుందని తెలుస్తుండగా.. ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు ఫ్యాన్స్. కాగా ఈ పాత్ర కోసం ముందుగా రమ్యకృష్ణను సంప్రదించినా.. పలు కారణాల వల్ల తను తప్పుకోవడంతో ఈ గ్రేట్ రోల్ రవీనాకు దక్కింది.

యశ్ హీరోగా వస్తున్న సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ కాగా.. అధీరగా విలన్ అవతారంలో కనిపించబోతున్నారు సంజయ్ దత్. ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, రావు రమేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమాను ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తుండగా.. విజయ్ కిరగందుర్ నిర్మాత.

Next Story

Most Viewed