యువకులతో హిజ్రాలు ఎంజాయ్.. ఇంతలో పోలీసుల ఎంట్రీ..

by  |
Rave-Party
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో కూకట్‌పల్లిలో సంచలన ఘటన వెలుగు చూసింది. గుట్టుగా జరుపుకుంటున్న రేవ్ పార్టీని ఎస్వోటీ పోలీసులు భగ్నం చేశారు. వివరాల ప్రకారం.. రేవ్ పార్టీ జరుగుతోందన్న పక్కా సమాచారంలో వివేకానంద నగర్‌లోని ఓ ఇంటిపై ఎస్వోటీ టీం దాడులు జరిపింది. ఈ దాడిలో 44 మంది యువకులు, ఇద్దరు హిజ్రాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా ఆ ఇంట్లో సోదాలు నిర్వహించగా భారీగా మద్యం బాటిళ్లు, కండోమ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే యువకులంతా ప్రతీ వీకెండ్ ఇలాగే పార్టీలు నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే పట్టుబడిన వారంతా హోమో సెక్సువల్స్‌ అని పోలీసులు అనుమానిస్తున్నారు.


Next Story