అక్టోబర్ లో విడుదలకు సిద్దమైన 'రావ‌ణలంక‌'

by  |
అక్టోబర్ లో విడుదలకు సిద్దమైన రావ‌ణలంక‌
X

దిశ, వెబ్‌డెస్క్: క్రిష్, అశ్విత, త్రిష, ముర‌ళీ శ‌ర్మ‌, దేవ్ గిల్ ప్ర‌ధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రావ‌ణలంక‌’. కె.సిరీస్ మూవీ ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ పై క్రిష్ బండిప‌ల్లి నిర్మించిన ఈ సినిమాకు బి.ఎన్.ఎస్ రాజు ద‌ర్శ‌కత్వం వహించారు. శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్దమయ్యింది. ఇక ఇటీవలే విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని 2021 అక్టోబర్ 29న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.ఈ చిత్రం మొత్తం రామాయాణాన్ని బేస్ చేసుకుని చేసిన చిత్రమని, ఇందులోని ప్ర‌తి పాత్ర చాలా అద్భుతంగా వ‌చ్చిందని డైరెక్టర్ బి.ఎన్.ఎస్ రాజు అన్నారు.

Next Story