- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
23న భారత్ బంద్‌కు రావణ్ పిలుపు
ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును నిరసిస్తూ భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ రావణ్.. ఈ నెల 23న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. రిజర్వేషన్లు పొందడం ప్రాథమిక హక్కు కాదనీ, రాష్ట్రాలు ఆ రిజర్వేషన్ల అమలుకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని ఇటీవలే సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రావణ్ మాట్లాడుతూ.. ‘నేను కోర్టును గౌరవిస్తాను. మనందరం గౌరవిస్తాం. గౌరవించాల్సిందే. అయితే, కోర్టులూ కొన్నిసార్లు పొరపాటు చేస్తుంటాయి. అలాగే, రిజర్వేషన్ల అంశంపైనా న్యాయస్థానం పొరబడింది. రాష్ట్ర ప్రభుత్వ అభీష్టానికే రిజర్వేషన్ల అమలును కట్టబెట్టడాన్ని అంగీరించబోం. రిజర్వేషన్లు మా ప్రాథమిక హక్కు. రాష్ట్ర ప్రభుత్వ దయా దాక్షిణ్యానికి మా హక్కును వదులుకోం. వాటిని ఎలా పొందాలో మాకు తెలుసు.’ అని చెప్పారు. ఢిల్లీలోని మండి హౌజ్ నుంచి పార్లమెంటు వరకు ఈ నెల 16న నిరసన ర్యాలీ ఉంటుందని తెలిపారు. అలాగే, 23వ తేదీన భారత్ బంద్‌ను పాటించాలని పిలుపునిచ్చారు. సామాజిక సంఘాలు, కార్యకర్తలు మద్దతునివ్వాలని కోరారు.