రతన్ టాటా కూడా భగ్నప్రేమికుడే!

by  |
రతన్ టాటా కూడా భగ్నప్రేమికుడే!
X

జీవితంలో ఎదగడం కోసమో లేక మరేదైనా కారణం వల్లనో పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయిన వాళ్లు ఉంటారు. గట్టిగా అనుకుంటే పెళ్లి నుంచి తప్పించుకోవచ్చు. కానీ ప్రేమ నుంచి తప్పించుకోవడం మాత్రం అంత సులభం కాదు. సక్సెస్‌ఫుల్ బిజినెస్ మ్యాన్ రతన్ టాటా చెప్పిన విషయం విన్న తర్వాత ప్రేమ నుంచి తప్పించుకోవడం అసాధ్యమేమోనని కూడా అనిపిస్తుంది. అవును… ప్రేమ గురించి మాట్లాడింది రతన్ టాటానే. ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలనే తపనతో కనిపించే రతన్ టాటా, ప్రేమ గురించి మాట్లాడటమేంటని అనుకుంటున్నారా? ఒక్క ప్రేమ గురించే కాదు తన జీవితానికి సంబంధించి చాలా వ్యక్తిగత విషయాలను ఆయన పంచుకున్నారు. హ్యూమన్స్ ఆఫ్ బాంబే ఫేస్‌బుక్ పేజీలో టాటాజీ ఈ విషయాలను చెప్పారు.

ముందుగా టాటాజీ ఆయన చిన్నతనం గురించి మాట్లాడుతూ తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడం వల్ల అనేక ఇబ్బందులకు, సూటిపోటి మాటలకు గురైనట్లు తెలిపారు. అంతేకాకుండా నానమ్మ తనకు నేర్పిన నైతిక విలువల పాఠాల గురించి క్షుణ్నంగా వివరించారు.

ఇక ప్రేమ ప్రస్తావన తీసుకొస్తూ… 1962 ఇండో-చైనా యుద్ధం కారణంగా తాను భగ్నప్రేమికుడిగా మిగిలిపోవాల్సి వచ్చిందని టాటా అన్నారు. లాస్ ఏంజెలీస్‌లో మొదలైన తన ప్రేమ ప్రయాణం, పెళ్లి వరకు వెళ్లి, నానమ్మ ఆరోగ్యం బాగోలేని కారణంగా ఎలాంటి మలుపులు తిరిగిందో వివరించారు. తన ప్రేయసిని దాదాపు ఇండియాకు తీసుకు వచ్చేద్దామనుకున్న తరుణంలో వారి పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో తన ప్రేమ బంధం అక్కడే ఆగిపోయిందని టాటా చెప్పుకొచ్చారు. ఇన్ని చెప్పిన టాటాజీ ఆమె పేరు కూడా చెప్తే మనసుకి కాస్త సంతృప్తి ఉండేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


Next Story