రష్మిక స్పెషల్ అప్పియరెన్స్‌లో ‘టాప్ టక్కర్’

by  |
రష్మిక స్పెషల్ అప్పియరెన్స్‌లో ‘టాప్ టక్కర్’
X

దిశ, సినిమా : క్యూట్ బ్యూటీ రష్మిక మందన ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. టాలీవుడ్, కోలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులు చేస్తున్న భామ.. బాలీవుడ్‌లోనూ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీటితో పాటు ఫస్ట్ టైమ్ ఓ మ్యూజిక్ వీడియోతో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసింది. యశ్ రాజ్ ఫిల్మ్స్ డిజిటల్, సాగా మ్యూజిక్ సమర్పణలో ‘టాప్ టక్కర్’ పేరుతో వస్తున్న ఈ వీడియో సాంగ్‌ను ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు మేకర్స్.

రష్మిక స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చిన ఈ సాంగ్‌లో యువన్ శంకర్ రాజా, బాద్‌షా, జోనిత గాంధీ స్టెప్స్ వేయడంతో పాటు మ్యూజిక్ కంపోజ్ చేశారు. హిందీ, తమిళ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సాంగ్‌కు డైరెక్టర్ విఘ్నేశ్ శివన్, బాద్‌షా కలిసి లిరిక్స్ అందించగా.. అమర్‌ప్రీత్ జీఎస్ చాబ్రా దర్శకత్వం వహించారు. కాగా వీడియోలో రష్మిక డ్యాన్స్ చూసిన ఫిదా అవుతున్న నెటిజన్లు.. #TopTucker హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండ్ చేస్తున్నారు.



Next Story

Most Viewed