అండర్ వేర్‌ని అలా చూసిన హీరోయిన్.. మండిపడుతున్న నెటిజన్లు

by  |
అండర్ వేర్‌ని అలా చూసిన హీరోయిన్..  మండిపడుతున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: భారతీయ చిత్ర ప్రరిశ్రమలో మంచి క్రేజ్‌ సంపాదించుకుంటోన్న హీరోయిన్ రష్మిక మందన్నా.. త్వరలో సిద్ధార్థ్‌ మల్హోత్రా హీరోగా చేస్తున్న ‘మిషన్‌ మజ్ను’తో బాలీవుడ్‌కు పరిచయం కానుంది. కాగా తనకున్న పాపులారిటీతో ఎన్నో రకాల బ్రాండ్‌ల యాడ్స్‌లోనూ నటిస్తూ మంచి ఆదాయాన్ని అర్జిస్తోన్న నటి.. తాజాగా బాలీవుడ్‌ నటుడు విక్కీ కౌశల్‌తో కలిసి ఆమె చేసిన అండర్‌వేర్‌ యాడ్‌ విమర్శల పాలైంది.

అందులో రష్మిక యోగా ఇన్‌స్ట్రక్టర్‌గా ఉండగా, విక్కీ యోగా చేస్తుంటాడు. ఆ సమయంలో షర్ట్‌ పైకి లేవడంతో అతని అండర్‌వేర్‌ పట్టీ బయటికి కనిపిస్తుంది. అది గమనించిన నటి ఇంప్రెస్‌ అయ్యి అలాగే చూస్తూ ఉంటుంది. అది అండర్‌గార్నమెంట్ బ్రాండ్ మాకోకి సంబంధించిన ప్రకటన. ఈ మేరకు స్పందించిన నెటిజన్లు ఇలాంటి చీప్‌ యాడ్‌ ఎప్పుడూ చూడలేదంటూ ట్రోల్‌ చేస్తున్నారు. తమ అభిమాన నటినుంచి ఇలాంటి చౌకబారు ప్రకటన ఊహించలేదని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయగా.. అండర్‌ వేర్‌ దుస్తుల కంపెనీలు ఎందుకు ఇలాంటి అర్థం పర్ధం లేని యాడ్స్‌ తీస్తున్నారు అని మరొకరు కామెంట్‌ చేశారు. అసలు ఈ అండర్ వేర్, డియోడరెంట్ కంపెనీలు ఇలాంటి ప్రకటనలతో ఏం చెప్పాలనుకుంటున్నారని తిట్టిపోస్తున్నారు.



Next Story

Most Viewed