సౌత్‌ను వదలనంటున్న రష్మిక.. కోలీవుడ్‌లో పాగా!

by  |
సౌత్‌ను వదలనంటున్న రష్మిక.. కోలీవుడ్‌లో పాగా!
X

దిశ, సినిమా : నేషనల్ క్రష్ రష్మిక మందన బాలీవుడ్‌తో పాటు సౌత్‌లోనూ క్రేజీ చాన్స్‌లు కొట్టేస్తోంది. ఈ మధ్య అమితాబ్ బచ్చన్‌తో మూవీ షూటింగ్‌లో పాల్గొని, అందుకు సంబంధించిన పిక్స్ షేర్ చేసిన భామ.. బాలీవుడ్‌లో బిజీ అయిపోయేట్లుగానే కనిపిస్తోంది. దీంతో ఇక సౌత్ వైపు చూసే అవకాశమే లేదనుకున్నారు. కనీసం డియర్ కామ్రేడ్ విజయ్ దేవరకొండతో అయినా సినిమా చేస్తుందా? అనుకున్నారు. కానీ అందరి అంచనాలు తారుమారు చేస్తూ.. మరో కోలీవుడ్ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పినట్లు సమాచారం. ఇంతకుముందు హీరో కార్తి ‘సుల్తాన్’తో తమిళ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న రష్మిక.. ఇప్పుడు శివ కార్తికేయన్ సినిమాలో ఫిమేల్ లీడ్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ‘జాతి రత్నాలు’ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో రాబోతున్న ఈ బైలింగ్వల్ మూవీని నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మించనున్నారు. అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్న చిత్రానికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే రాబోతోంది.


Next Story