బాయ్‌ఫ్రెండ్ కోసం అమెరికా చెక్కేసిన రష్మిక..? 

by  |
Rashmika
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ రష్మిక మందన యూఎస్ఏ బయలుదేరింది. తన బెస్టీ విజయ్ దేవరకొండ ‘లైగర్’ మూవీ షూటింగ్ అక్కడే జరుగుతుండగా.. ఫ్రీ టైమ్‌ను తనతో కలిసి ఎంజాయ్ చేసేందుకు రెడీ అయిపోయింది. ఈ క్రమంలో తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పాస్‌పోర్ట్ పిక్ షేర్ చేసిన భామ.. ‘ఈ సారి నీకు చాలా దూరంగా ఉన్నాను కానీ త్వరలో తిరిగి వస్తాను’ అని క్యాప్షన్ యాడ్ చేసింది. అంతేకాదు ఫ్లైట్‌లో సెల్ఫీ షేర్ చేసిన రష్మిక.. ‘నేను ఎక్కడున్నానో చెప్పుకోండి చూద్దాం’ అని అభిమానులను అడిగేసింది. కాగా విజయ్‌తో కలిసి షూటింగ్ స్పాట్‌లో ఎంజాయ్ చేయడం రష్మికకు కొత్తేమీ కాదు. గతంలో ‘లైగర్’ షూటింగ్ గోవాలో జరుగుతుండగా అక్కడ వాలిపోయిన భామ.. ఆ వెకేషన్‌ను మెమొరబుల్‌గా మార్చుకున్న విషయం తెలిసిందే.

సమంతకు బంపర్ ఆఫర్.. వారి కాంబో రిపీట్..?


Next Story

Most Viewed