‘మిషన్ మజ్ను’ షూటింగ్‌కు రెడీ అవుతున్న రష్మిక

by  |
‘మిషన్ మజ్ను’ షూటింగ్‌కు రెడీ అవుతున్న రష్మిక
X

దిశ, సినిమా : సౌత్ సెన్సేషన్ రష్మిక మందన ‘మిషన్ మజ్ను’తో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాకు జోడీగా కనిపించబోతున్న భామ.. ఇందుకోసం ఇప్పటికే యాక్టింగ్ వర్క్ షాప్‌కు కూడా హాజరైంది. ఫిబ్రవరి 12 నుంచి లక్నోలో మూవీ సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కాబోతుండగా.. సిద్ధార్థ్‌తో పాటు సెట్స్‌లో జాయిన్ కానుంది లిల్లీ.

45 రోజుల పాటు జరిగే లాంగ్ షెడ్యూల్‌లో ఉత్తరప్రదేశ్ హజ్రత్ గంజ్‌లోని జహంగిరా బాద్ ప్యాలెస్‌, లా మార్టినియర్ కాలేజీ, మలిహాబాద్ సిటీ రోడ్స్‌పై చిత్రీకరణ జరగనుంది. త్వరలో ఫస్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్‌ సెట్స్‌లోకి ఎంటర్ కానున్న రష్మిక.. ఇందుకోసం సూపర్ ఎగ్జైటింగ్‌గా ఉంది. ఇక ‘మిషన్ మజ్ను’ రిలీజ్‌కు ముందే బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించే అవకాశాన్ని కొట్టేసింది భామ. డెడ్లీ టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రంపై త్వరలో అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.


Next Story

Most Viewed