నాది పాన్ ఇండియా రేంజ్.. ముంబైలోనే మకాం అంటున్న రష్మిక

by  |
నాది పాన్ ఇండియా రేంజ్.. ముంబైలోనే మకాం అంటున్న రష్మిక
X

దిశ, సినిమా : శాండల్‌వుడ్.. టాలీవుడ్.. కోలీవుడ్.. బాలీవుడ్.. అని తేడా లేకుండా కన్నడ బ్యూటీ రష్మిక మందన అన్ని ఇండస్ట్రీలను దున్నేస్తోంది. ప్రస్తుతం నార్త్, సౌత్‌లో పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న హీరోయిన్.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా సెటిలయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయనేది విశ్లేషకుల అంచనా. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘మిషన్ మజ్ను’ తన ఫస్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కాగా, ఆ తర్వాత అమితాబ్ బచ్చన్‌ కాంబినేషన్‌లో ‘డెడ్లీ’ సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే.

ఈ మేరకు ఫ్యూచర్‌లో ఎక్కువ టైమ్ ముంబైలోనే గడపాల్సి వస్తుందనే ఆలోచనతో ఓ విలాసవంతమైన ఫ్లాట్ కొనుగోలు చేసిందని సమాచారం. అంతేకాదు ఇప్పటికే పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న బన్ని ‘పుష్ప’లోనూ నటిస్తున్న రష్మిక.. ఆ తర్వాత శంకర్ – చెర్రీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో ఫిమేల్ లీడ్‌గా ఎంపికైంది. దీంతో రష్మిక రేంజ్ పెరిగిపోయిందని.. బాలీవుడ్, పాన్ ఇండియా మూవీస్‌కు మాత్రమే ఓకే చెప్పే చాన్స్ ఉందంటున్నారు.

May be an image of 2 people, people standing and ocean



Next Story

Most Viewed