రష్మిక బాలీవుడ్ ఎంట్రీ

by  |
రష్మిక బాలీవుడ్ ఎంట్రీ
X

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ క్రష్ రష్మిక మందన హవా నడుస్తోంది. టాలీవుడ్, శాండల్ వుడ్‌లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న చార్మింగ్ గర్ల్.. సుల్తాన్ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చి వావ్ అనిపించింది. ఆ తర్వాత సౌత్‌లో వరుసగా సూపర్ స్టార్స్‌తో సినిమాలు సైన్ చేసిన భామ.. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్‌లో అడుగుపెట్టేస్తోంది. కో స్టార్స్ అందరూ హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టాలని ఏళ్లకు ఏళ్లుగా కలలు కంటూనే ఉండగా.. రష్మిక చాలా సింపుల్‌గా ఆఫర్ కొట్టేయడం, ఆ న్యూస్ కూడా సర్‌ప్రైజింగ్‌గా, అఫిషియల్‌గా అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ థ్రిల్ అవుతున్నారు. బాలీవుడ్ చిత్రసీమను ఏలాలని ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.

ఇండియాస్ గ్రేటెస్ట్ కోవర్ట్ ఆపరేషన్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్ర హీరో..ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది క్యూట్ గర్ల్ రష్మిక. ఆర్ఎస్‌వీపీ మూవీస్, గిల్టీ బై అసోసియేషన్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాకు ‘మిషన్ మజ్ను’ టైటిల్ ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. శాంతను బాగ్చి దర్శకత్వంలో వస్తున్న సినిమాతో న్యూ జర్నీ స్టార్ట్ చేయబోతున్న రష్మిక..ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం చాలా సంతోషంగా ఉందని ట్విట్టర్ వేదికగా తెలిపింది.


Next Story

Most Viewed