బాలీవుడ్ ఎంట్రీకి క్యూట్ బ్యూటీ ప్రిపరేషన్

by  |
బాలీవుడ్ ఎంట్రీకి క్యూట్ బ్యూటీ ప్రిపరేషన్
X

దిశ, వెబ్‌డెస్క్: క్యూట్ రష్మిక మందన బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందని అఫిషియల్ అనౌన్స్‌మెంట్ ఇటీవల వచ్చేసింది. సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా వస్తున్న ‘మిషన్ మజ్ను’ సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయం కాబోతున్న భామ.. ఇందుకోసం ప్రిపేర్ అవుతోంది. ఈ క్రమంలో రెండు వారాల క్రితం ముంబైకి చేరుకున్న లిల్లీ బేబీ..వర్క్ షాప్స్‌కు అటెండ్ అయిందట. సినిమాలో తన క్యారెక్టర్ గురించి బాగానే బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేసిందని తెలుస్తోంది. 15 రోజుల పాటు ముంబైలోనే గడిపిన రష్మికకు సిటీ బాగా నచ్చిందని.. మరోసారి వచ్చేందుకు ఎగ్జైట్ అవుతుందని మూవీ యూనిట్ చెప్తోంది.

ఇండియాస్ గ్రేటెస్ట్ కోవర్ట్ ఆపరేషన్ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న సినిమాను ఆర్ఎస్‌వీపీ మూవీస్, గిల్టీ బై అసోసియేషన్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా..శాంతను బాగ్చి దర్శకులు. ఇక ఈ ప్రాజెక్ట్‌తో పాటు బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో కలిసి మరో బాలీవుడ్ ప్రాజెక్ట్‌లో నటించబోతుంది భామ. ‘డెడ్లీ’ టైటిల్‌తో వస్తున్న చిత్రంలో కన్నడ బ్యూటీ.. బచ్చన్ జీకి కూతురిగా కనిపించనుందని..మార్చి నుంచి సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని బీ టౌన్ టాక్. ఈ సినిమాను ఏక్తా కపూర్, రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించే అవకాశం ఉంది.


Next Story

Most Viewed