డియర్ లిల్లీ.. డిఫరెంట్ యాంగిల్ !

by  |
డియర్ లిల్లీ.. డిఫరెంట్ యాంగిల్ !
X

‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న.. గీతాగోవిందంతో‌ స్టార్ స్టేటస్‌ను దక్కించుకుంది. డియర్ కామ్రేడ్ సినిమాలో లిల్లీగా అలరించింది. ప్రస్తుతం తెలుగులో అగ్ర హీరోల సరసన ఆఫర్లను చేజిక్కించుకుంటూ క్రేజీ హీరోయిన్‌గా కొనసాగుతోంది. ‘అందం, అభినయానికి తోడు కాస్త చిలిపితనాన్ని ప్రదర్శించే రష్మిక.. ‘ఎప్పుడూ నవ్వుతూనే ఉండండి.. అదే మన కష్టాలను దూరం చేయగలదు’ అని చెబుతోంది. అసలు విషయానికొస్తే.. రష్మికను అభద్రతా భావం వెంటాడుతోందట.

https://www.instagram.com/p/CAapIZoJXbs/?utm_source=ig_web_copy_link

ఈ లాక్‌డౌన్ సమయంలో.. చిన్న చిన్న విషయాలకే తను అభద్రతాభావానికి గురికావడం ఆశ్చర్యం కలిగిస్తోందని అంటోంది. ‘స్పష్టంగా చెప్పాలంటే ఈ లాక్‌డౌన్‌లో నేను.. నా పని, శరీరం, మానసిక ఆరోగ్యంతోపాటు ప్రతిదాని గురించి ఆందోళనకు గురయ్యాను. చివరికి కనుగొన్నది ఏంటంటే.. ప్రతి విషయంపై మనకు నియంత్రణ లేదని, కాబట్టి మనల్ని నియంత్రించగలిగే విషయాలను నియంత్రణలో ఉంచి.. మనల్ని మనం ఉత్తములుగా తీర్చిదిద్దుకోవాలి’ అని సూచిస్తోంది. మన అభద్రతా భావాలనే బలంగా మార్చుకుని ముందుకు సాగాలి అంటోంది.

‘మీరు చాలా అందవిహీనంగా ఉన్నారు.. మీ కళ్లు పెద్దగా ఉన్నాయి.. చాలా సన్నగా ఉన్నారు’ లాంటి కామెంట్స్ చేస్తే లైట్ తీసుకోండి. మిమ్మల్ని మీరు నమ్మండి అని చెప్తోంది రష్మిక. అభద్రతా భావాలు వస్తుంటాయి వెళ్తుంటాయి.. మీరేంటి.. మీ పవర్ ఏంటి అని తెలుసుకుని.. మీ లైఫ్‌ను ఎంజాయ్ చేయమని సెలవిస్తోంది.



Next Story

Most Viewed