రోషియన్స్‌కు రష్మిక సజెషన్స్..

by  |
రోషియన్స్‌కు రష్మిక సజెషన్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: ట్విట్టర్‌లో ప్రస్తుతం రష్మిక మందన ‘నేషనల్ ఫిమేల్ క్రష్’ ట్రెండ్ నడుస్తుండగా.. ఈ ట్రెండ్ క్రియేట్ చేసిన రోషియన్స్‌కు థాంక్స్ చెప్పింది రష్మిక. అభిమానులను లెజెండరీగా అభివర్ణించిన డియర్ లిల్లీ.. ఎప్పటిలాగే సజెషన్స్ ఇచ్చింది. ఎవరేం చెప్పినా సంబంధం లేకుండా అనుకున్నది చేయాలని, పని ప్రారంభించాక వెనక్కి చూడకుండా.. అదే పనిమీద కాన్సంట్రేట్ చేయాలని తెలిపింది. ఈ ప్రాసెస్‌లో ఎవరినీ బాధించకుండా, ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టకుండా, నీ మీద నమ్మకముంచి.. నీ పని నువ్వు చేయాలని చెప్పింది. నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నావో ఎవరూ గుర్తించకపోయినా పర్వాలేదు. పైన ఉన్న ఒక శక్తి అబ్జర్వ్ చేస్తుంటుంది.. తనకి తెలుసు ఎవరికి ఏమి ఇవ్వాలో అని తెలిపిన రష్మిక.. సరైన దారిలో నడిపించేందుకు అదే శక్తి గైడెన్స్ ఇస్తూనే ఉంటుందని చెప్పింది.

కాగా, రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ‘పుష్ప’ ఫిల్మింగ్‌లో బిజీగా ఉంది. ఇప్పటికే తమిళ్‌లో కార్తి ‘సుల్తాన్’ ప్రాజెక్ట్ పూర్తి చేసిన భామ.. సూర్య నెక్స్ట్ ప్రాజెక్ట్‌లోనూ ఫిమేల్ లీడ్ చేస్తుందని టాక్. ఇక తెలుగులో అక్కినేని అఖిల్‌తో రొమాన్స్ చేసేందుకు సిద్ధం అయిపోగా.. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి డైరెక్టర్ కాగా, త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.


Next Story